సినారే మృతి సాహితీలోకానికి తీరని లోటు

తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ డా. సి. నారాయణరెడ్డి మృతి సాహితీలోకానికి తీరని లోటని మంత్రి హరీష్‌రావు అన్నారు. సినారె భౌతిక కాయానికి ఆయన నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. సినారె చేసిన సేవలను మంత్రి హరీష్ రావు కొనియాడారు. తెలంగాణకు గౌరవం, వన్నె తెచ్చిన గొప్ప వ్యక్తి నారాయణరెడ్డి అని చెప్పారు. సినారె  మన మధ్య లేకపోయినా.. ఆయన రచనలు, జ్ఞాపకాలు, కావ్యాలు ఎప్పటికీ మన మధ్యనే నిలిచి ఉంటాయన్నారు. వారి గౌరవాన్ని, కీర్తిని ఇనుమడించేలా త్వరలోనే ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందన్నారు.