సినారె కు తుది వీడ్కోలు

విశ్వంభ‌రుడు సినారెకు సీఎం కేసీఆర్ ఘ‌నంగా తుదివీడ్కోలు ప‌లికారు. హైదరాబాద్ ఫిల్మ్‌న‌గ‌ర్‌లో ఉన్న‌ మ‌హాప్ర‌స్థానంలో ఇవాళ జ‌రిగిన సినారె అంత్య‌క్రియల‌కు సీఎం కేసీఆర్ హాజ‌ర‌య్యారు. త‌న అభిమాన క‌వి అయిన సినారె అంతిమ‌యాత్ర‌లో ఆయ‌న పాల్గొన్నారు. ముందు ఉండి కార్య‌క్ర‌మాన్ని న‌డిపించారు. సినారె క‌వితా శైలిని విశిష్టంగా అభిమానించే సీఎం కేసీఆర్.. అంత్య‌క్రియ‌ల తంతు ముగిసే వ‌ర‌కు మ‌హాప్రస్థానంలోనే ఉన్నారు. సినారె పార్థివ‌దేహానికి పుష్పాంజ‌లి ఘ‌టించారు.