సిద్దిపేటలో బీడీ కార్మికులకు భృతి పత్రాల పంపిణీ

సిద్దిపేట జిల్లా కేంద్రంలో మంత్రి హరీశ్ రావు బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల జీవన భృతి పత్రాలను అందచేశారు. సిద్దిపేట నియోజకవర్గంలోనే 900 మంది బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల భృతిని అందిస్తున్నట్లు చెప్పారు. కల్యాణ లక్ష్మీ పథకం కింద 75 వేల రూపాయలను ఇస్తున్నామన్నారు. కేసీఆర్ కిట్ పేరిట బాలింతలకు 16 రకాల వస్తువులను అందిస్తున్నామన్నారు. సిద్దిపేట పట్టణంలో 270 కోట్ల రూపాయల ఖర్చుతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తామని చెప్పారు. గోదావరి నుండి సాగునీరు తెస్తామని, 24 గంటలు ప్రతి ఇంటికి మంచినీరు ఇస్తామని తెలిపారు. నీటిని వృధా చెయ్యవద్దని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌ తో పాటు పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు, అధికారులు పాల్గొన్నారు.