సింగిల్స్ ఫైనల్‌కు చేరేదెవరు?

మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో రొమేనియా నంబర్‌వన్ సిమోనా హాలెప్, చెక్ రిపబ్లిక్ స్టార్ కరోలినా ప్లిస్కోవాలు అమీతుమీ తేల్చుకోనున్నారు. క్వార్టర్స్‌లో మూడోసీడ్ హాలెప్ 3-6, 7-6(8/6), 6-0తో ఎలినా స్వితోలినా (ఉక్రెయిన్)పై గెలిచింది. మూడేండ్లక్రితం మహిళల సింగిల్స్ లో హాలెప్ రన్నరప్‌గా నిలిచింది. మరో మ్యాచ్‌లో ప్రపంచ రెండోర్యాంకర్ ప్లిస్కోవా 7-6(7/3), 6-4తో ఫ్రాన్స్ క్రీడాకారిణి కరోలినా గార్సియాను ఓడించి ఆతిథ్య దేశ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. రోలాండ్‌గారోస్‌లో ప్లిస్కోవాకిదే తొలి సెమీఫైనల్. మరో సెమీఫైనల్లో లాత్వియా క్రీడాకారిణి జెలెనా ఓస్టాపెన్‌కోతో స్విస్ భామ తిమియా బాసిన్‌స్కీ తలపడనుంది.