సారస్వత పరిషత్‌కు సినారె పార్థివదేహం

ఆధునిక తెలుగు కవిసార్వభౌముడు, జ్ఞానపీఠ్  అవార్డు గ్రహీత సినారె పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం బొగ్గులకుంటలోని సారస్వత పరిషత్ హాల్ లో ఉంచారు. పెద్దసంఖ్యలో సాహితీవేత్తలు, కవులు, ప్రముఖులు, అభిమానులు…కడచూపుకోసం తరలివస్తున్నారు. ఆయన పార్థివదేహంపై పుష్పగుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. సాహిత్య రంగానికి సినారె చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. మరికాసేపట్లో సినారె అంతిమయాత్ర సారస్వత పరిషత్ నుంచి ప్రారంభం కానుంది. ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.