సాంబ సెక్టార్‌లో సెర్చ్ ఆపరేషన్

జమ్మూకాశ్మీర్  సాంబ సెక్టార్‌లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలతో ఆర్మీ అప్రమత్తమైంది. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో.. భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. సాంబ సెక్టార్ లోని ప్రతి గ్రామాన్ని తనిఖీ చేస్తున్నాయి. అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి. ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో ఉగ్ర చొరబాట్లు పెరగడంతో.. అనుమానాస్పద కదలికలపై సమాచారమివ్వాలని స్థానికులను ఆర్మీ కోరింది.