సరిహద్దు గ్రామాలపై పాక్‌ రేంజర్ల కాల్పులు     

జమ్మూ కాశ్మీర్‌ సరిహద్దులో పాక్ దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజౌరీ జిల్లాలోని నౌషెరా  సెక్టార్‌లో పాక్‌ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దు గ్రామాలే లక్ష్యంగా మోటార్  షెల్స్ తో  దాడులకు దిగింది.  వెంటనే  అప్రమత్తం అయిన భారత భద్రతా బలగాలు..  పాక్   రేంజర్ల కాల్పులను  సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ముందస్తు జాగ్రత్తగా నౌషెరా సెక్టార్‌ లోని రోడ్లను అధికారులు మూసివేశారు.