సమిష్టి పోరాటంతోనే ఉగ్రవాదం అంతం

ఉగ్రవాదంపై పోరాటానికి షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్య దేశాలన్ని ఏకతాటిపైకి రావాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. సమిష్టి పోరాటంతోనే ఉగ్రవాదం అంతమవుతుందని చెప్పారు. ఖజకిస్థాన్ లోని ఆస్తానాలో జరుగుతున్న షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ లో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ఎస్‌సీవోలో భారత సభ్యత్వానికి ఆమోదం తెలిపిన దేశాలకు ధన్యవాదాలు తెలిపారు. రిక్రూట్ మెంట్, శిక్షణ, ఆర్థిక సహాయం విషయంలో పరిష్కారం కనుక్కోకుంటే ఉగ్రవాదాన్ని అంతం చేయడం అసాధ్యమన్నారు.