సకల జనులకు సమపాలన

దేశంలోనే సకల జనుల, సర్వమతాల సమపరిపాలన సాగిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ దేనన్నారు మంత్రి జోగు రామన్న. ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని పథకాలు తెలంగాణలో అమలౌతున్నాయని చెప్పారు. రిజర్వేషన్లపై నానా యాగి చేస్తున్న విపక్షాలు.. ఆయా ప్రభుత్వాల హయాముల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఒరగబెట్టిందేమిటో ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారాయన. ఎస్టీ, మైనారిటీల రిజర్వేషన్ల అమలు విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సైతం ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు.