షోయబ్ బౌలింగ్ ఫన్‌గా ఉంటుంది!

విరాట్ కోహ్లీ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన డిన్నర్ కార్యక్రమంలో ఎమ్మెస్‌ ధోనీకి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురయ్యింది. క్రికెట్ కెరీర్‌లో ఎదుర్కొన్న కఠినమైన ఫాస్ట్ బౌలర్ ఎవరని ఫ్యాన్స్‌ అడిగారు. ఫాస్ట్ బౌలర్లందరినీ ఎదుర్కోవడం కష్టమేనని, అయితే అందులో ఒకరి పేరు చెప్పాలంటే తాను పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అంటానన్నాడు ధోనీ. అతడు చాలా వేగంగా బంతి విసరుతాడని, దీంతో పాటు యార్కర్, బౌన్సర్ ఏది వేస్తాడో చెప్పలేమన్నాడు. అంతేకాదు.. బంతిని శరీరం పైకి కూడా విసురుతాడని నవ్వుతూ చెప్పాడు. అక్తర్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం చాలా ఫన్‌గా ఉంటుందని ధోనీ అన్నాడు. గతంలో ఒకసారి అక్తర్ బౌలింగ్‌లో ధోనీ వరుసగా ఫోర్లు బాదాడు. దీంతో అక్తర్ బంతిని నేరుగా ధోనీ శరీరం పైకి విసిరాడు.