శ్రీకాంత్‌కు ఘన స్వాగతం

ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సీరిస్‌లో విజేతగా నిలిచిన హైదరాబాద్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో బంధుమిత్రులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ…  పట్టుదల, శ్రమకు లభించిన ఫలితం ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సీరిస్‌విజయమన్నాడు. తన తరువాతి లక్ష్యం ఆగస్టులో జరిగే ప్రపంచ చాపియన్‌షిప్ అని తెలిపాడు. దాదాపు ఆరు వారాల పాటు పూర్తిగా దానిపైనే దృష్టిపెట్టి సిద్ధమవుతానని చెప్పాడు.