శంకర్ పల్లిలో గోదాం ప్రారంభం

రంగారెడ్డి జిల్లా శంకర్‌ పల్లి మండలంలోని పలుగ్రామాల్లో మంత్రి మహేందర్‌ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. శంకర్‌ పల్లి వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో నిర్మించిన 2500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదామును ప్రారంభించారు. అలాగే మార్కెట్‌ కమిటీ ఆవరణలో కోటి 11 లక్షల ఖర్చుతో నిర్మించనున్న సీసీ రోడ్లు, ఇతర పనులకు శంకుస్థాపన చేశారు.