వైభవంగా భద్రకాళి శాకాంబరి ఉత్సవాలు

వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు మూడో రోజు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం కుల్లా క్రమంలో అమ్మవారు దర్శనం ఇచ్చారు. సాయంత్రం నిత్య క్లిన్నా  క్రమంలో దర్శనం ఇస్తారు. అనంతరం గణపతి పూజ, పుణ్య హవచనం, మాతృక పూజ, ఆయుశ్య మత్రజపం నిర్వహిస్తారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.