వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం

హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ తల్లి రథోత్సవాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌ ప్రారంభించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, తాడుతో రథం లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. రథోత్సవాన్ని చూసేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆనవాయితీ ప్రకారం ఊరేగింపు నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. సీఎం కేసీఆర్‌ దేవాలయాల అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి.. పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్టు వెల్లడించారు.