వైద్య ఆరోగ్య రంగం బలోపేతానికి కృషి

రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు.  సీఎం కేసీఆర్‌ ఆలోచన నుంచి వచ్చిందే కేసీఆర్‌ కిట్ పథకమని చెప్పారు. గత ప్రభుత్వాలు వైద్య-ఆరోగ్యశాఖను నిర్లక్ష్యం చేశాయని మండిపడ్డారు. హైదరాబాద్‌  ఎర్రగడ్డ మెంటల్‌  హాస్పిటల్‌లో రూ.18 కోట్లతో నిర్మించనున్న  సెంటర్‌  ఆఫ్‌  ఎక్సలెన్స్‌ భవన నిర్మాణానికి మంత్రి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. తెలంగాణ వచ్చినంక ప్రభుత్వాస్పత్రుల ముఖచిత్రాలను మార్చేస్తున్నట్లు చెప్పారు. అటు వైద్య విద్యార్థుల కోసం 9 బస్సులను మంత్రి ప్రారంభించారు.  సరోగసి విధానంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటమని లక్ష్మారెడ్డి హెచ్చరించారు.