వైట్‌హౌజ్‌లో మోడీకి అపూర్వ స్వాగతం

అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ లో ప్రధాని మోడీకి అపూర్వ స్వాగతం లభించింది. భారత కాలమాన ప్రకారం మంగళవారం తెల్లవారు జామున ఒంటిగంటకు మోడీ వైట్‌ హౌస్‌కు చేరుకున్నారు. ట్రంప్‌, మెలినియా దంపతులు మోడీని ఆహ్వానించారు. షేక్ హ్యాండిచ్చి ఆత్మీయంగా పలుకరించారు. రెండు నిమిషాల పాటు మేయిన్‌  గేట్‌  దగ్గర యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

అటు ఓవెల్‌ రూంకు చేరుకున్న మోడీ.. తనకు లభించిన గౌరవంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈగౌరవం తనకు లభించింది మాత్రమే కాదని ,125 కోట్ల భారతీయులదని చెప్పారు మోడీ. ట్రంప్ అధ్యక్షుడు కాకముందు 2014లో భారత్‌కు వచ్చినపుడు తన గురించి చేసిన వ్యాఖ్యలను ఎప్పటికీ మర్చిపోలేనని గుర్తు చేశారు. తర్వాత ఓవెల్‌ రూం ఆవరణలో ట్రంప్‌, మెలినియాతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు మోడీ.

మరోవైపు.. ట్రంప్‌ సైతం మోడీపై ప్రశంసలు గుప్పించారు. ప్రపంచలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రధానమంత్రిని వైట్‌ హౌస్‌లోకి ఆహ్వానించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాని చెప్పారు. రెండు దేశాల రాజ్యాంగాలు వీ ద పీపుల్‌ అనే మూడు పదాలతో ప్రారంభమవుతాయని, ఈ మూడు పదాలు ఎంత ముఖ్యమైనవో మోడీకి తనకు తెలుసన్నారు ట్రంప్‌.