వైజాగ్‌ అబ్బాయిని చేసుకుంటుందా?

భవిష్యత్తులో తాను వైజాగ్‌లోనే స్థిరపడతానంటుంది యాంకర్ రష్మి. విశాఖలో  కొత్తగా ఏర్పాటు చేసిన ఓ షాప్ ప్రారంభానికి రష్మి ముఖ్య అతిథిగా విచ్చేసింది.  ఆది సరసన తాను ఓ సినిమాలో నటించానని, ఆ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా రష్మి చెప్పింది. రష్మి వైజాగ్‌లోనే స్థిరడతాను అని ప్రకటించడంతో ఆమె వైజాగ్‌కు చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటుందేమోననే ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి. విశాఖకు చెందిన వ్యాపార వేత్త కుమారుడినో.. రాజకీయ వేత్త కుమారుడినో రష్మి పెళ్లి చేసుకోనుందని టాక్ వినిపిస్తోంది. చూద్దాం.. రష్మి ఎవరిని చేసుకుంటుందో!