వెస్ట్ లండన్‌లో భారీ అగ్నిప్రమాదం

వెస్ట్ లండన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 27 అంతస్తుల ఎత్తైన  గ్రెన్‌ఫెల్ టవర్  అగ్నికీలల్లో చిక్కుకుంది. 40 ఫైరింజన్లతో 200 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. 2వ అంతస్తు మొదలు చిట్టచివరి 27 అంతస్తువరకు మంటలు వ్యాపించాయి. భవనంలోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ తెల్లవారు జామున లాన్‌కస్టర్ వెస్ట్ లాటిమర్ రోడ్డులోని ఈ అపార్ట్‌మెంటులో మంటలు చెలరేగాయి. భవనంలో చిక్కుకున్న వారిని బయటికి తరలించే ప్రక్రియ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. కాగా ఈ భవనాన్ని 1974లో నిర్మించారు. ఇందులో మొత్తం 120 వరకు ఫ్లాట్లు ఉన్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.