వెస్టిండీస్ టూర్ కు భారత జట్టు ఖరారు

ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత వెస్టిండీస్‌ లో పర్యటించే భారత జట్టును బిసిసిఐ ప్రకటించింది. ప్రస్తుత జట్టులో రెండు మార్పులు చేశారు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ, పేసర్‌ బుమ్రాను పక్కన పెట్టారు. వారి స్థానంలో యువ వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాట్స్‌ మెన్‌ రిషబ్‌ పంత్‌, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌లకు చోటు కల్పించారు. వెస్టిండీస్‌ పర్యటనలో కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు అయిదు వన్డేలు, ఒక టీ ట్వంటీ మ్యాచ్‌ ఆడుతుంది.