విలువల కోసం మా పోరాటం కొనసాగుతుంది

విలువలు, సిద్ధాంతపరమైన భావజాలం కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు  కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ. ఇప్పటికే విపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయన్న ఆమె.. మీరా కుమార్ గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పారు. సత్యం కోసం తమ పోరాటం కొనసాగుతోందన్నారు. రాష్ట్రపతి పదవికి 17 ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా మీరాకుమార్ నామినేషన్ వేసిన తర్వాత పార్లమెంట్ దగ్గర ఆమె మీడియాతో మాట్లాడారు.

మరోవైపు, ఈ నెల 30న అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో నిర్వహించే జీఎస్టీ ప్రారంభ సమావేశానికి హాజరు కావాలా వద్దా అనే విషయం నిర్ణయించేందుకు రేపు కాంగ్రెస్ పార్టీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనుంది.