విమర్శలకు దీపిక కౌంటర్‌!

బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్న దశలోనే దీపికా పదుకొనే.. హాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ప్రస్తుతం సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘పద్మావతి’లో నటిస్తోంది. తాజాగా ‘మాగ్జిమ్‌’ కోసం దీపకా ఓ హాట్‌హాట్‌ ఫోటో షూట్‌లో పాల్గొంది. అందులో గ్లామర్‌ కాస్త హద్దులు దాటడంతో విమర్శలు ఎక్కువయ్యాయి. మొదటి ఫోటో షేర్‌ చేయగానే విమర్శలు చేశారు కొంతమంది నెటిజన్లు. దీనికి కౌంటర్‌గా మరో ఫోటోను అప్‌లోడ్‌ చేసింది దీపిక. దీంతో విమర్శలు మరింత ఎక్కువైపోయాయి. దీంతో దీపిక ఆ విమర్శలకు సమాధానం చెప్పింది. “నిన్నటివరకు ప్రియాంక చోప్రా మీద విమర్శలు గుప్పించారు. ఇప్పుడు నన్ను విమర్శిస్తున్నారు. మేం ఎలా కనిపించాలన్నది మాకు సంబంధించిన విషయం. అందులో ఇతరుల జోక్యం అనవసరం. మా లుక్‌ గ్లామరస్‌గా ఉందనిపిస్తే చూసి ఎంజాయ్‌ చేయండి. లేకపోతే పట్టించుకోకండి. అంతేగాని ఇలా విమర్శలు చేయకండి. డ్రెస్సింగ్‌ కోసం ఎంత కసరత్తులు చేస్తామో.. ఆ డ్రెస్‌కూ సూట్‌ అయ్యేలా బాడీని మార్చుకోవడానికి అంతకంటే ఎక్కువ కష్టపడతాం” అని చెప్పింది.