విప్రోలో వాటా విక్రయించం

విప్రోలో ప్రమోటర్లు వాటా విక్రయించే ఆలోచనలో ఉన్నారంటూ వచ్చిన వార్తలను సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ ఖండించారు. ఆ కథనాలు నిరాధార, ద్వేషపూరితమైనవని విప్రో సిబ్బందికి రాసిన లేఖలో ప్రేమ్‌జీ పేర్కొన్నారు. దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ విప్రో ప్రమోటర్ అయిన ప్రేమ్‌జీ, ఆయన కుటుంబం సంస్థ నుంచి పాక్షికంగా లేదా పూర్తిగా వైదొలిగే ఆలోచనలో ఉన్నట్లుగా, ఇందుకోసం ప్రేమ్‌జీ ఫ్యామిలీ పలు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌లను సంప్రదించినట్లుగా వార్తలొచ్చాయి. విప్రోలో వీరికి 73.25 శాతం వాటా ఉంది. తమ వాటాకెంత విలువ లభిస్తుందని తెలుసుకునేందుకు ప్రేమ్‌జీ కుటుంబం బ్యాంకులను ఆశ్రయించిందని కొందరు బ్యాంక్ అధికారులు తెలిపారు.