విపక్షాలకు మరో ఎదురు దెబ్బ

తెలంగాణ ప్రగతికి  మోకాలడ్డుతున్న విపక్షాలకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను నిలిపివేయాలన్న ప్రతిపక్షాలకు భంగపాటు తప్పలేదు. ఈ ప్రాజెక్టుపై నిపుణుల కమిటీని వేయాలంటూ..గ్రీన్ ట్రిబ్యునల్ సింగిల్ మెంబర్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. పనులను నిలివేయాలంటూ  సింగిల్ మెంబర్ బెంచ్ ఆదేశించడం చెల్లదని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్ వ్యాఖ్యానించారు. దీంతో ప్రతిపక్షాల కుతంత్రాలు మరోసారి పటాపంచలయ్యాయి.