వినూత్నంగా యూత్ వింగ్ శుభాకాంక్షలు

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పారు గ్రేటర్‌ హైదరాబాద్‌ టిఆర్ఎస్ యూత్‌ వింగ్‌ నాయకులు. వింగ్ ఇంచార్జ్‌ జగన్‌మోహన్‌ రావు ఆధ్వర్యంలో పటాన్‌చెరులో ట్రాక్టర్‌తో సీఎం కేసీఆర్‌ బొమ్మ గీశారు. ల్యాండ్ మ్యూరలింగ్‌ పద్ధతిలో సీఎం కేసీఆర్‌ చిత్రాన్ని ఆవిష్కరించారు. ఇలాంటి చిత్రం గీయడం ఇండియాలో ఇదే మొదటిసారి అన్నారు జగన్‌మోహన్‌రావు.