వరంగల్ లో భక్తిశ్రద్ధలతో రంజాన్ ప్రార్థనలు

వరంగల్ జిల్లాలో రంజాన్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. మసీదులు, ఈద్గాలలో వేలాది మంది ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌, సీపీ సుధీర్‌బాబు తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.