వనపర్తిలో మైనారిటీ బాలికల గురుకులం ప్రారంభం

రాష్ట్రంలో కేజీ టూ పీజీ విద్యను ఉచితంగా అందించేందుకు సీఎం కేసీఆర్‌ అన్ని చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి. గతంలో ఎన్నడూ లేని విధంగా  రికార్డ్ సంఖ్యలో గురుకుల పాఠశాలలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలో మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలను ఆయన ప్రారంభించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, బ్యాగులు, స్టడీ మెటీరియల్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిన్నారెడ్డితో పాటు కలెక్టర్‌ శ్వేతా మహంతి తదితరులు పాల్గొన్నారు.