లష్కరే తొయిబాకు మరో ఎదురు దెబ్బ

కాశ్మీర్‌ లో ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు మరో ఎదురు దెబ్బ తగిలింది.  అనంత్‌  నాగ్‌  జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో  లష్కరే తోయిబా టాప్‌  కమాండర్‌ జునైద్‌   మట్టూతో పాటు అతని అనుచరుడు ముజామిల్‌  హతమయ్యాడు. బిజిబిహారా సమీపంలోని ఆర్వాని గ్రామంలోని ఓ ఇంట్లో ముగ్గురు ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో పోలీసులు, ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌  చేపట్టిన ఈ ఆపరేషన్లో మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు.  ఉగ్రవాదులు నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.