లండన్ లో ఉగ్రవాదుల బీభత్సం

లండన్  లో మరో దాడి జరిగింది. ఫిన్స్  బరీ పార్క్  సెవెన్  సిస్టర్  రోడ్డులోని మసీదు సమీపంలో పాదచారులపైకి వ్యాన్  దూసుకెళ్లింది. ఈ ఘటనలో పదిమందికి పైగా గాయపడ్డారు. ముస్లింలు రాత్రిపూట నిర్వహించే ప్రార్థనల అనంతరం దుర్ఘటన సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. వ్యాన్  డ్రైవర్  ను అరెస్టు చేశారు. సెవన్  సిస్టర్స్  రోడ్డును మూసివేసి ఆపరేషన్  కొనసాగిస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక ఉద్దేశపూర్వకంగా చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  లండన్  వంతెన దగ్గర ఉగ్రవాదులు బీభత్సం మరువకముందే ఈ ఘటన జరగడం అక్కడి ప్రజలకు భయభ్రాంతులకు గురి చేసింది.