లంకపై సౌతాఫ్రికా గెలుపు

ఓపెనర్ హషీమ్ ఆమ్లా (103) వీరోచిత సెంచరీతో చెలరేగడంతో.. చాంపియన్స్ ట్రోఫీ  లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 96 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు 50 ఓవర్లలో 6 వికెట్లకు 299 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (75)తో కలిసి ఆమ్లా రెండో వికెట్‌కు 145 పరుగులు జోడించాడు. డుమిని (38 నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. తర్వాత లంక 41.3 ఓవర్లలో 203 పరుగులకే కుప్పకూలింది. తరంగ (57) టాప్ స్కోరర్. కుశాల్ పెరీరా (44 నాటౌట్), డిక్‌వెల్లా (41) ఓ మాదిరిగా ఆడారు. స్పిన్నర్ తాహిర్ 4 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు.