రోడ్డు ప్రమాదంలో రవితేజ తమ్ముడు మృతి

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ ఔటర్ రింగ్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీహీరో రవితేజ సోదరుడు భరత్ మృతిచెందాడు. ఆగి ఉన్న లారిని భరత్ కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భరత్ అక్కడికక్కడే మృతిచెందాడు. శంషాబాద్  ఎయిర్ పోర్ట్ నోవాటెల్ హోటల్ నుంచి వస్తుండగా ఈ ఘటన జరిగింది. కాగా భరత్ మృతదేహన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.