రైతు కుటుంబాలను కలిసిన చౌహాన్

మధ్యప్రదేశ్‌లో ఇటీవల పోలీసు కాల్పుల్లో మృతి చెందిన ఆరు రైతు కుటుంబాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కలుసుకున్నారు. మండ్‌ సౌర్‌కు వెళ్లిన ఆయన ముందుగా వాగ్దానం చేసిన ప్రకారం ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం అందజేశారు. తన భార్య సాధనతో కలిసి ప్రత్యేక విమానంలో సీఎం అక్కడికి చేరుకున్నారు. మృతులందరూ వేర్వేరు జిల్లాల్లోని వేర్వేరు గ్రామాలకు చెందిన వారు కావడంతో ముఖ్యమంత్రి చౌహాన్ వారి ఇండ్లన్నింటికీ వెళ్లి వారి కుటుంబాలను కలుసుకున్నారు. తమ గ్రామానికి తారు రోడ్డు వేయాలని మృతుడు చైన్‌రాం తండ్రి విజ్ఞప్తి చేయగా, వెంటనే స్పందించిన సీఎం రోడ్డును, కమ్యూనిటీ హాల్‌ను, స్మారక కేంద్రాన్ని మంజూరు చేశారు.