రైతు ఆత్మహత్యలకు కాంగ్రెస్సే కారణం

గత ప్రభుత్వాల వైఫల్యంతోనే రైతులకు కష్టాలు వచ్చాయని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. గత పాలకులు రైతులకు 4 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేదని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ ముందు వరుసలో ఉందని స్పష్టం చేశారు.  దేశంలోనే కందుల ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్నామని చెప్పారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. విపక్షాలు కోర్టులకెళ్లి ప్రాజెక్టులను అడ్డుకోవడం మంచిది కాదన్నారు. కోర్టుల్లో విపక్షాలకు ఎదురుదెబ్బలు తగిలినా కూడా వారి వైఖరిలో మార్పు రావడం లేదని మండిపడ్డారు. రైతు ఆత్మహత్యలకు కాంగ్రెస్సే కారణమన్నారు. అద్భుతమైన వ్యవసాయ పాలసీతో ప్రభుత్వం ముందుకెళ్తున్నదని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎకరాకు రూ. 8 వేలు పెట్టుబడి ఇస్తున్నామని గుర్తు చేశారు.