రెవిన్యూ శాఖలో 2,506 పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం

రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల జోరు కొనసాగుతోంది. నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి రెవిన్యూ శాఖలో 2,506 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. వెంటనే నియామక ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ను ఆదేశించారు.

సిసిఎల్ఎ ఆఫీసులో డిప్యూటీ కలెక్టర్లు-8, డిప్యూటీ తహశీల్దార్లు-38, డిప్యూటీ సర్వేయర్లు-100, జూనియర్ అసిస్టెంట్లు/టైపిస్టులు-400, జూనియర్ అసిస్టెంట్లు-21, రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో జిల్లా రిజిస్ట్రార్లు-7, సబ్ రిజిస్ట్రార్లు-22, సర్వేయర్లు-110, కంప్యూటర్ డ్రాఫ్ట్ మెన్-50, జూనియర్ అసిస్టెంట్లు-50, వీఆర్వోలు-700, వీఆర్ఏలు-1000 మంది నియామకానికి సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు.