రెండో రోజుకు చేరిన మహారాష్ట్ర రైతుల సమ్మె

మహారాష్ట్రలో అన్నదాతల సమ్మె రెండో రోజుకు చేరింది. వెంటనే సర్కారు పంట రుణాలు మాఫీ చేయాలంటూ శిర్డీలో పాలను రోడ్డు మీద పారబోసి నిరసన తెలిపారు. మరికొన్ని ప్రాంతాల్లో కూరగాయలు, పండ్లు రోడ్ల మీద పడేసి నిరసన వ్యక్తం చేశారు. రుణాలు మాఫీ కోసం గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా.. ఫడ్నవీస్‌ సర్కార్‌   పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమ్మెకు కూలీలు, మార్కెట్‌ యూనియన్లు మద్దతునిచ్చారు. రైతుల సమ్మెతో మహారాష్ట్ర వ్యాప్తంగా కూరగాయలు, పాల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.