రూ.706కే విమాన టిక్కెట్!

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా.. సావన్ స్పెషల్ పేరుతో డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈనెల 21 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ ద్వారా ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో విమానయన టిక్కెట్ ధరను కనిష్ఠంగా రూ.706కే అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ తెలిపింది. ఈ టిక్కెట్లను ఎయిర్ ఇండియా బుకింగ్ ఆఫీసుల్లో, www.airindia.in ద్వారా గానీ, సంస్థ మొబైల్ యాప్ ద్వారా గానీ లేదా అధికారిక ట్రావెల్ ఏజెంట్ల ద్వారా గానీ కొనుగోలు చేయవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. ఈ ఆఫర్‌లో బుకింగ్ చేసుకున్న టిక్కెట్లతో వచ్చేనెల 1 నుంచి సెప్టెంబర్ 20 మధ్యలో ప్రయాణించేందుకు వీలుంటుంది. ఈమధ్యే ప్రైవేట్ విమానయాన సేవల సంస్థలు స్పైస్‌జెట్, ఇండిగో, గో ఎయిర్ కూడా ఇదే తరహాలో టిక్కెట్లపై ప్రత్యేక రాయితీలు ప్రకటించాయి.