రూట్ మార్చిన బాలీవుడ్ బాద్ షా

ఈ మధ్యన వరసగా సీరియస్ ఫిలింస్ చేసుకుంటూ వచ్చిన బాలీవుడ్ బాద్ షా షారూక్ కాస్త రూటు మార్చాడు. తనకు బాగా పేరు తెచ్చిన రొమాంటిక్ ఎంటర్ టెయినర్ జోన్ లో కొత్త సినిమా చేశాడు. అతడి లేటెస్ట్ ఫిలి జబ్ హ్యారీ మెట్ సెజల్ ఆగస్టు 4న థియేటర్లకు రానుంది. దీనికి సంబంధించి అప్పుడే ప్రమోషన్ స్టార్ట్ చేశారు. సాధారణంగా కొత్త సినిమాలకు ప్రమోషన్ చేయడంలో ట్రయిలర్లు చాలా ఇంపార్టెంట్. కానీ హ్యారీ మెట్ సెజల్ సినిమాకు ట్రయిలర్ దింపకుండా మినీ ట్రయిల్స్ రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి 30 సెకండ్ల మినీ ట్రయల్స్ ను ఆదివారం నుంచి రోజుకొకటి చొప్పున రిలీజ్ చేస్తున్నారు. తాజాగా హీరో షారూక్ హీరోయిన్ అనుష్కశర్మ సినిమాల గొడప పడుతూ ఉన్న సీన్లతో ‘ఎక్స్ క్యూజ్ హై’ పేరిట రిలీజ్ చేశారు. కోపంలో ఇద్దరూ మాటామాటా అనుకోవడంతో పాటు ఒకరిపై ఒకరు పంచులు వేసుకుంటున్న సీన్లు భలేగా ఉన్నాయి. హీరోయిన్ పై తిట్ల దండకం అందుకుంటూ చివరిలో మాటలు మింగేస్తూ షారూక్ చెప్పిన డైలాగులు అభిమానులను మురిపించేలా ఉన్నాయి. హీరోయిన్ అనుష్క శర్మ గుజరాతీ యాక్సెంట్ లో చెబుతున్న డైలాగులు ఆమెకు బాగానే సూటయ్యాయి.
30 సెకండ్ల మినీ ట్రయల్ లోనే సినిమా ఎలా ఉండబోతోందో చెప్పడమే కాదు.. దానిపై ఆసక్తి కలిగించడమూ చిన్న విషయమేం కాదు. ఆ విషయంలో కింగ్ ఖాన్ ఓ రకంగా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.