రిలీజ్‌కు ముందే రూ. 200 కోట్లు వసూలు

బాహుబలి సినిమా రేంజ్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు శంకర్‌ తెరకెక్కిస్తోన్న రోబో-2 రెడీ అవుతోంది. రజనీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా 2018కి బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలుస్తుందని భావిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమా హిందీ థియేటర్‌ ప్రదర్శన హక్కులు ఏకంగా రూ. 80 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా శాటిలైట్‌ రైట్స్‌ కోసం జీ నెట్‌వర్క్‌ ఏకంగా రూ. 110 కోట్లు చెల్లించింది. మొత్తానికి విడుదలకు ముందే ఈ చిత్రం దాదాపు రూ. 200 కోట్ల వ్యాపారం చేసింది.