రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వానలు

ఉత్తర ఒడిషా, జార్ఖండ్  పరిసరాల్లో  ఆవరించిన ఉపరితల ఆవర్తనం.. ఒడిషా నుంచి దక్షిణ తమిళనాడు వరకు  విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో జోరు వానలు పడుతున్నాయి. జిల్లాల్లోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అటు హైదరాబాద్లో ఉరుములతో కూడిన వాన కురిసింది. జోరు వానకు భాగ్యనగరం తడిసి ముద్దైంది.  హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌, నేరేడ్‌మెట్‌, కుషాయిగూడ, ఏఎస్‌రావునగర్‌, సరూర్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, చక్రీపురంలో చిరుజల్లులు కురిశాయి. తార్నాక, నాచారం, ఉప్పల్‌,  ఖైరతాబాద్‌, నాంపల్లి, కోఠి, అబిడ్స్‌, బషీర్‌  బాగ్‌, బేగంబజార్‌  లో ఓ మాదిరి వర్షం పడింది. మేడ్చల్‌ జిల్లాలోని ఘట్‌కేసర్‌, కీసరలోనూ వర్షం కురిసింది.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, హయత్‌  నగర్‌, ఇబ్రహీంపట్నం మండలాల్లో  వర్షం కురిసింది. జగిత్యాల జిల్లాలోనూ వర్షం పడింది.  జగిత్యాలలో భారీ వర్షం పడగా.. ధర్మపురిలో చిరుజల్లులు  కురిశాయి. అటు కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం మండలాల్లో వాన కురిసింది. మెదక్‌ జిల్లా రామాయంపేటలో.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, సిరిసిల్లలో చిరుజల్లులు కురిశాయి. కరీంనగర్ పట్టణంతో పాటు వీణవంక, జమ్మికుంట మండలాల్లో వర్షం పడింది.  నిజామాబాద్‌ రూరల్‌, బోధన్‌, బాల్కొండ నియోజకవర్గాల్లో మోస్తరు వర్షం పడింది.  యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో భారీ వర్షం కురిసింది. అటు  చౌటుప్పల్  మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో వర్షం పడింది. మోత్కూరులోనూ వర్షం కురిసింది.   మంచిర్యాల జిల్లా జైపూర్, భీమారం, చెన్నూర్, కోటపల్లి మండలాల్లో వర్షం పడింది. సూర్యాపేట జిల్లా తిరుమల గిరిలోనూ వర్షం పడింది.

సిద్ధిపేట జిల్లా గజ్వేల్, వర్గల్, ములుగు, మర్కూక్, దుబ్బాక మండలాల్లోని పలుగ్రామాల్లో వర్షం కురిసింది.   సీఎం కేసీఆర్ దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేటలో వర్షం పడింది.   వరంగల్‌ రూరల్ జిల్లావ్యాప్తంగా వర్షం పడింది..వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని హన్మకొండలో వర్షం పడింది.   వేలేరు మండలంలో భారీ వర్షం కురవగా ధర్మసాగర్  మండలంలో  మోస్తరు వర్షం పడింది. అటు  మహబూబాబాద్‌ జిల్లా  మాహబూబాద్, కేసముద్రం, నెల్లికుదురు మండలాల్లో వర్షం కురిసింది. డోర్నకల్ నియోజకవర్గంలో చిరుజల్లులు  కురిశాయి. ఖమ్మం జిల్లా   బొనకల్ , చింతకాని మండలాలలో భారీ వర్షం కురిసింది.  వైరా,  కొణిజర్ల,  తల్లాడ, మధిర, ఎర్రుపాలెం,  నేలకొండపల్లి, ముదిగొండ మండలాల్లో  వర్షం పడింది. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా   ఇల్లందు లో భారీ వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  అశ్వరావుపేటలో మోస్తరు వర్షం పడింది.