రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ కిట్ల పంపిణీ

గ్రేటర్ హైదరాబాద్ ఏరియాలో కేటీఆర్ కిట్ల పంపిణీ ఘనంగా జరిగింది. మంత్రి పద్మారావు  లాలాపేట ప్రభుత్వ ఆస్పత్రిలో బాలింతలకు కిట్లను పంపిణీ చేశారు. గాంధీ ఆస్పత్రిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా కిట్ల పంపిణీ జరిగింది. మల్లాపూర్ లో మేయర్ బొంతు రామ్మోహన్ … బాలింతలకు కేసీఆర్ కిట్లను అందజేశారు. బోరబండలో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బాలింతలకు కిట్లను పంపిణీ చేశారు. కుత్బుల్లాపూర్ లోని షాపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద కిట్లను పంపిణీ చేశారు.  రాజేంద్రనగర్ కమ్యూనిటీ హాల్ లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కిట్ల పంపిణీలో పాల్గొన్నారు. ఘట్కేసర్  ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి,  జడ్పీ ఛైర్మన్ సునీతా మహేందర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు కిట్లను అందజేశారు. ఉప్పల్ , రామంతాపూర్ ప్రభుత్వాసుపత్రుల్లో MLA ప్రభాకర్ కేసీఆర్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

రంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ కిట్ల పంపిణీకి అపూర్వ స్పందన వచ్చింది. వనస్థలి పురం ఆస్పత్రిలో మంత్రి మహేందర్ రెడ్డి.. బాలింతలకు కిట్లు పంపిణీ చేశారు. ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. షాద్ నగర్ లో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ బాలింతలకు కిట్లను అందజేశారు. చేవెళ్ల ప్రభుత్వాసుపత్రిలో కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో జడ్పీ ఛైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొన్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేసీఆర్ కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. చిట్యాల మండలం సివిల్ హాస్పిటల్లో కె.సి.ఆర్ కిట్ పథకాన్ని స్పీకర్ మధుసూదనాచారి ప్రారంభించారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హన్మకొండ మిషన్ హాస్పటల్లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బాలింతలకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, నగర మేయర్ నరేందర్, ఉమెన్ అండ్ చైల్డ్  వెల్ఫేర్ చైర్మన్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి పాల్గొన్నారు. వరంగల్ అర్బన్ లోని మట్వాడ ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే కొండా సురేఖ బాలింతలకు కిట్లను అందజేశారు. పంపిణీ వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కిట్ల పంపిణీని ప్రారంభించారు.

మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూర్, వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తిలో కేసీఆర్ కిట్  పథకాన్ని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. మహబూబాబాద్ లో మంత్రి చందూలాల్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ బాలింతలకు కిట్లను అందజేశారు. అటు మరిపెడ మండల కేంద్రంలోని PHC లో ఎమ్మెల్యే రెడ్యా నాయక్ కేసీఆర్ కిట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పెద్దపల్లి జిల్లాలో కిట్ల పంపిణీ కార్యక్రమం జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తింది. పెద్దపల్లిలో ఎంపీ సుమన్, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కిట్లను పంపిణీ చేశారు. అటు గోదావరిఖనిలో ఎంపీ సుమన్ తో పాటు ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ చేతుల మీదుగా కిట్ల పంపిణీ జరిగింది. మంథని ప్రభుత్వాసుపత్రిలో  ఎమ్మెల్యే పుట్టా మధు, జగిత్యాల ఆస్పత్రిలో జడ్పీ ఛైర్మన్ తుల ఉమ,  ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కిట్ల పంపిణీలో పాల్గొన్నారు. ఇటు ధర్మపురిలో చీఫ్ విఫ్ కొప్పుల ఈశ్వర్ ప్రభుత్వం ప్రతిత్మకంగా చేపట్టిన KCR కిట్ల పంపిణిలో పాల్గొన్నారు. మెతుకుసీమలో కేసీఆర్ కిట్ల పంపిణీ కార్యక్రమానికి బాలింతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సిద్దిపేట ఎంసీహెచ్ లో హరిశ్ రావు… కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రారంభించారు. బాలింతలకు కిట్లను అందజేశారు. మెదక్ లో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి లబ్ధిదారులకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. ఆందోల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాబు మోహన్, దుబ్బాక ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి, పటాన్ చెరు ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కిట్ల పంపిణీలో పాల్గొన్నారు. జహీరాబాద్ లో ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, హుస్నాబాద్ లో ఎమ్మెల్యే సతీశ్ కుమార్ …బాలింతలకు కిట్లను అందజేశారు.

సూర్యాపేట జిల్లాలో కేసీఆర్ కిట్ పథక ప్రారంభోత్సవం పండుగ వాతావరణాన్ని తలపించింది. సూర్యాపేట ప్రభుత్వాస్పత్రిలో కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రారంభించారు మంత్రి జగదీష్ రెడ్డి. ఆసుపత్రిలో బాలింతలకు కేసీఆర్ కిట్లను అందించారు. అటు నల్లగొండ ప్రభుత్వాసుపత్రిలోనూ కేసీఆర్ కిట్లను అందజేశారు మంత్రి జగదీశ్ రెడ్డి. అటవీ అభివృద్ధి సంస్ద ఛైర్మెన్ బండా నరేందర్ రెడ్డి, జెడ్పీ ఛైర్మెన్ బాలూ నాయక్, ఎమ్మెల్సీ రవీందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాగార్జున సాగర్ లోని కమలానెహ్రూ ప్రభుత్వ దవాఖానాలో కిట్ల పంపిణీలో ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. దేవరకొండ ప్రభుత్వాసుత్రిలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ కిట్ల పంపిణీ చేశారు. నకిరేకల్ లోని ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ పూల రవీందర్ లు కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. తుంగతుర్తి , తిరుమలగిరి ప్రభుత్వాసుపత్రుల్లో ఎమ్మెల్యే గాదరి కిషోర్  కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. యాదగిరిగుట్ట లో విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి బాలింతలకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. భువనగిరిలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి చేతుల మీదుగా కిట్ల పంపిణీ జరిగింది. చౌటుప్పల్ డివిజన్ కమ్యూనిటీ హెల్త్  సెంటర్లో  కిట్ల పంపిణీలో ఎం ఎల్ ఎ కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.

మహబూబ్ నగర్ జిల్లాలో కేసీఆర్ కిట్ల పంపిణీకి మంచి స్పందన వచ్చింది. మహబూబ్ నగర్ లో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్  బాలింతలకు కిట్లను పంపిణీ చేశారు. నారాయణపేట ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కిట్లను పంపిణీ చేశారు. నాగర్ కర్నూల్ ఆసుపత్రిలో కేసీఆర్ కిట్ పథకాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ప్రారంభించారు. వనపర్తి జిల్లా గోపాల్ పేట మండల కేంద్రంలో కేసీఆర్ కిట్ పథకాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. మక్తల్ లో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రారంభించారు. బాలింతలకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లా ఏరియా ఆసుపత్రి లో మంత్రి జూపల్లి కృష్ణారావు, జడ్పీ ఛైర్మన్ భాస్కర్ కిట్ల పంపిణీలో పాల్గొన్నారు. కల్వకుర్తి ఆస్పత్రిలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ్ రెడ్డి కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు.

నిజామాబాద్ గవర్న్ మెంట్ ఆస్పత్రిలో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రారంభించారు. బాలితలకు కిట్లను అందజేశారు. కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్, నిజామాబాద్ రూరల్ లో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్మూర్ లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి … కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో కేసీఆర్ కిట్ పథకానికి అద్భుత స్పందన లభించింది. ఆదిలాబాద్ రిమ్స్ ప్రభుత్వ వైద్యశాలలో.. కేసీఆర్ కిట్ పథకాన్ని మంత్రి జోగు రామన్న ప్రారంభించారు. నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బాలింత మహిళలకు కిట్ లను పంపిణీ చేశారు. ఉట్నూర్ లో ఎమ్మెల్యే రేఖా శ్యాం నాయక్, బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య లబ్ధిదారులకు కిట్లను అందజేశారు. అటు మంచిర్యాలలో మంచిర్యాలలో ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్యే దివాకర్ రావు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ … బాలింతలకు కిట్లను పంపిణీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేసీఆర్ కిట్లను అందుకుంటూ బాలింతలు కళ్లు సంతోషంతో వెలిగిపోయాయి. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు … బాలింతలకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్. ఆసుపత్రిలో బాలింతల కు ఆయన.. కేసీఆర్ కిట్లను అందించారు. మణుగూరు ప్రభుత్వ వైద్యశాలలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు లబ్ధిదారులకు కిట్ల పంపిణీ చేశారు. ఇల్లందు  ప్రభుత్వ  ఆసుపత్రిలో ఎమ్మెల్యే  కోరం  కనకయ్య  కేసీఆర్  కిట్లను బాలింతలకు అందజేశారు. ఖమ్మంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, వైరాలో ఎమ్మెల్యే మదన్ లాల్ ఆధ్వర్యంలో కిట్ల పంపిణీ జరిగింది.