రాష్ట్రమంతా వర్షాలు

తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మరోవైపు, ఛత్తీస్  గఢ్ నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి  కొనసాగుతోంది. ద్రోణి, రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

మహబూబ్‌ నగర్‌ జిల్లా జడ్చర్లలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. నల్లకుంట చెరువు కట్ట తెగి రోడ్డుపైకి నీరు చేరింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. జడ్చర్ల మండలం అలూరులో పిడుగుపాటుకు కృష్ణయ్య అనే రైతు, బాదేపల్లిలో గోడ కూలి లక్ష్మీ అనే మహిళ మృతి చెందారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా తెల్కపల్లి మండలంలోని పలు గ్రామాల్లో మోస్తరు వర్షం కురిసింది. నాగర్‌కర్నూల్‌జిల్లా ఉప్పునుంతల మండలంలో మోస్తరు వర్షం కురువగా కల్వకుర్తి మండలంలో చిరుజల్లులు కురిశాయి. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్‌, ఐజలో భారీ వర్షం పడింది.

నల్లగొండ మండలంలో భారీ వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం, చౌటుప్పల్‌ మండలాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. సూర్యాపేట మండలంలో దేవరకొండలో మోస్తరు వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం, చౌటుప్పల్‌ మండలాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. సూర్యాపేట మండలంలో మోస్తరు వర్షం కురిసింది. నల్లగొండ జిల్లా చిట్యాల, నార్కట్‌ పల్లి మండలాల్లో వర్షం పడింది.

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో చిరుజల్లులు కురిశాయి. మంథని, ముత్తారం, రామగిరి మండలాల్లో మోస్తరు వర్షం పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో భారీ వర్షం కురిసింది. కరీంనగర్  జిల్లా గన్నేరువరం మండలంలో మోస్తరు వర్షం పడింది. కరీంనగర్‌ టౌన్‌, తిమ్మాపూర్‌, మానకొండూరు మండలంలో వర్షం కరిసింది. జగిత్యాల జిల్లా ధర్మపురి, మెట్‌ పల్లితో పాటు పలు గ్రామాల్లో మోస్తరు వర్షం పడింది. మంచిర్యాల పట్టణంతో పాటు బెల్లంపల్లి మండలంలో భారీ వర్షం కురిసింది. అటు మంథని మండలంలో వర్షం పడింది.

సంగారెడ్డి నియోజకవర్గంలో చిరుజల్లులు కురిశాయి. నారాయణఖేడ్‌, సదాశివపేటలో భారీ వర్షం కురిసింది. మెదక్‌ జిల్లా రేగోడు, రామాయంపేట, నార్సింగి, శంకరంపేట అల్లాదుర్గం, వట్పల్లి మండలంలో వర్షం పడింది. సిద్దిపేట  దౌల్తాబాద్‌ మండలం పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది.

నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌, బోధన్‌, ఆర్మూర్‌ లో భారీ వర్షం కురిసింది. కోటగిరి, వర్ని, చందూర్‌, పోతంగల్‌, రుద్రూర్‌లో మోస్తరు వర్షం పడింది. మరోవైపు కామారెడ్డి జిల్లా బాన్సువాడ, బిక్నూర్‌, నాసుర్లాబాద్‌ మండలాల్లో మోస్తరు వర్షం పడింది.

వరంగల్‌ రూరల్ జిల్లా నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండిలో వర్షం కురిసింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ లో వర్షం కురిసింది. కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బెన, కెరెమెరి మండలాల్లో భారీ వర్షం పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మోస్తరు వర్షం పడింది.

హైదరాబాద్‌ లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సైదాబాద్‌, సంతోష్‌నగర్‌, కంచన్‌బాగ్‌ లో చిరుజల్లులు కురువగా.. అంబర్‌పేట్‌, ఓల్డ్‌సిటీ, బహదూర్‌పురా, కాలాపత్తర్‌‌, దూద్‌బౌలీ, బాలాపూర్‌, ఛత్రినాక, లాల్‌దర్వాజలో వర్షం పడింది. హుస్సేనీ ఆలం, పురానాపూల్‌‌, అంబర్‌ పేట్‌, సికింద్రాబాద్‌, తార్నాక, నాచారం, మల్లాపూర్‌, హబ్సిగూడ, ఉప్పల్‌ లో వర్షం పడింది. మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి, అల్వాల్‌, శామీర్‌ పేట్‌ లో వర్షం పడింది. లింగంపల్లి, చందానగర్‌‌, మియాపూర్‌లో మోస్తరు వర్షం కురిసింది. శంషాబాద్‌ లో వర్షం పడింది. వికారాబాద్‌ జిల్లా తాండూరు, పరిగి, కొడంగల్‌ లో వర్షం పడింది. అంగడి రాయచూర్‌, రుద్రదామ్‌ లో మోస్తరు వర్షం కురిసింది. హయత్‌ నగర్‌, ఇబ్రహీంపట్నంలో భారీ వర్షం కురువగా మహేశ్వరం, ఆరామ్‌ఘర్‌, కాటేదాన్‌, అత్తాపూర్‌ లో వర్షం పడింది.