రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకు బీజేపీ కమిటీ

రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై బీజేపీ దృష్టి పెట్టింది. అభ్యర్థి ఎంపిక కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌ జైట్లీ, వెంకయ్య నాయుడు సభ్యులుగా ఉన్న ఈ  కమిటీ.. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలతో చర్చలు జరపనుంది. మరో రెండ్రోజుల్లో రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్  విడుదల కానుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఐతే రాష్ట్రపతి రేసులో లోక్‌  సభ స్పీకర్‌  సుమిత్రా మహాజన్‌,  కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌, జార్ఘండ్‌ గవర్నర్ ద్రౌపది ముర్ముల ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జూలై 17న ఎన్నిక జరగనుంది.