రాష్ట్రపతి అభ్యర్థి కోసం ప్రతిపక్షాల భేటీ

రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు ఇవాళ ప్రతిపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో 17 పార్టీల నేతలు భేటీ కానున్నారు. ప్రతిపక్ష పార్టీల్లో ఏకాభిప్రాయం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌  చీఫ్‌  సోనియా.. ఇప్పటికే పలు పార్టీల నేతలతో భేటీ అయ్యారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం ఓ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఐతే ఇప్పటికే షెడ్యుల్‌  విడుదల కాగా.. ఇవాళ నోటిఫికేష్‌ రానుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ సమావేశానికి సీపీఎం, టీఎంసీ, జేడీయూ, ఆర్జేడీ, డీఎంకేతో పాటు పలు పార్టీల నేతలు హాజరుకానున్నారు.