రాష్ట్రపతి అభ్యర్థిగా మీరా నామినేషన్

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్‌ నామినేషన్ వేశారు. ప్రతిపక్ష నేతలతో కలిసి పార్లమెంట్‌కు వెళ్లిన ఆమె… పార్లమెంట్  సెక్రటరీకి నామినేషన్ పత్రాలు అందజేశారు. మీరా కుమార్‌  వెంట కాంగ్రెస్  అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్, ఆజాద్‌, ఖర్గే, శరద్ పవార్,  సీతారాం ఏచూరితో పాటు పలు రాష్ట్రాల కాంగ్రెస్‌  ముఖ్యమంత్రులు హాజరయ్యారు.