రాష్ట్రంలో 54 శాతం అధిక వర్షపాతం

నైరుతి రుతుపవనాలు ఈ సారి జోరుగా వర్షాలు కురిపిస్తున్నాయి. రాష్ట్రంలో గత నెల రోజుల్లో సాధారణం కంటే 54 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. జూన్ నెలలో  సాధారణ వర్షపాతం 117.9 సెంటీమీటర్లు కాగా.. 181.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే అధికంగా వర్షం కురిసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాధారణం కంటే  91 శాతం అధిక వర్షపాతం నమోదైంది. కరీంనగర్ లో సాధారణం కంటే 29 శాతం ఎక్కువ వర్షపాతం కురిసింది. అటు రాబోయే మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.