రాళ్లు రువ్విన అల్లరిమూకలు

జమ్మూ కాశ్మీర్ లో అల్లరిమూకలు రెచ్చిపోయాయి. శ్రీనగర్ లో రంజాన్ ప్రార్థనల తర్వాత సీఆర్పీఎఫ్ బలగాలపై రాళ్లతో దాడి చేశాయి. పరిస్థితి అదుపుతప్పడంతో.. టియర్ గ్యాస్‌  ప్రయోగించి అల్లరిమూకలను చెదరగొట్టారు జవాన్లు. దాంతో ఒక్కసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటు అనంత్ నాగ్‌, షోపియన్‌ జిల్లాల్లోనూ అల్లర్లు జరిగాయి. తాజా ఘటనలతో సెక్యూరిటీ మరింత టైట్‌ చేశారు అధికారులు. పరిస్థితి అదుపులోనే ఉందని చెప్తున్నారు.