రామ్ నాథ్ గెలుపు నల్లేరుపై నడకే!

రాష్ట్రపతి ఎన్నికలో ప్రాంతీయ పార్టీలు కింగ్ మేకర్లుగా మారనున్నాయి. దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్నప్పటికీ…..రాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్డీయే మ్యాజిక్ ఫిగర్ చేరుకునే పరిస్థితి లేదు. ఈ క్రమంలో టీఆర్ఎస్, అన్నాడీఎంకే వంటి ప్రాంతీయ పార్టీలే కీలకంగా మారాయి. అయితే దళిత అభ్యర్థిని ఎంపిక చేయడంతో….టీఆర్ఎస్ తమ పూర్తి మద్దతును ప్రకటించింది. దీంతో ఎన్డీయేకు ప్రాణం లేచి వచ్చింది. ఇక తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకే కూడా మద్దతివ్వడంతో…ఎన్డీయే గెలుపునకు కావాల్సిన ఎలక్ర్టోరల్ ఓట్లను దాదాపు సాధించగలిగే అవకాశముంది.

రాష్ట్రపతి ఎన్నికలో మొత్తం 10లక్షల 98వేల 903  ఎలక్ట్రోరల్ కాలేజీ ఓట్లు ఉంటాయి. అందులో సగానికి పైగా ఓట్లు అంటే…5లక్షల 49వేల 442 ఓట్లు సాధించిన వారే రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎన్నికవుతారు. 29 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి మొత్తం 776 మంది ఎంపీలు, 4 వేల 120 మంది ఎమ్మెల్యేలున్నారు. వారిలో ఒక్కో ఎంపీ ఓటు వాల్యూ 708గా ఉంటుంది. ఇక ఎమ్మెల్యేల ఓటు వాల్యూ ఆయా రాష్ట్రాల జనాభాను బట్టి మారుతుంది. అయితే ప్రస్తుతం ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు 5 లక్షల 27వేల 371 ఓటు వాల్యూ ఉంది. అంటే 48. 10 శాతం ఓట్లు ఎన్డీయేకు ఉన్నాయి. ఇందులో బీజేపీకి మాత్రమే సింగిల్ గా 40 శాతం ఓట్లు ఉన్నాయి. అంటే మ్యాజిక్ ఫిగర్ ను సాధించేందుకు ఎన్డీయేకు ఇంకా 1.7శాతం ఓట్లు కావాలి…స్పాట్

వాయిస్-యూపీఏ భాగస్వామ్య పక్షాలకు ప్రస్తతం లక్షా 73 వేల 849 ఓట్ వాల్యూ ఉంది. యూపీఏకు బయట నుంచి వామపక్షాలు, టీఎంసీ, ఎన్సీపీ, బీఎస్పీ, ఎస్పీ, ఆర్జేడీ, జేడీయూ, జేడీఎస్ వంటి పార్టీలు మద్దతిస్తున్నాయి.  వీటి మొత్తం ఓటు వాల్యూ 4 లక్షల 34 వేలకు పైగా ఉంది. ఇక బీజేడీ, ఆమ్ ఆద్మీతో పాటూ కొన్ని పార్టీలు ఎటూ తేల్చలేదు.

రాష్ట్రపతి ఎన్నికల్లో కింగ్ మేకర్లుగా మారిన ప్రాంతీయ పార్టీల ఓటు వాల్యూ 12 శాతానికి పైగా ఉంది. అంటే మెజార్టీ కంటే 10 శాతం ఓట్లు దక్కనున్నాయి.  ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్….ఎన్డీయే అభ్యర్ధి రామ్ నాథ్ కోవింద్ కు మద్దతు తెలిపారు. దళిత నేతను రాష్ట్రపతిగా చేయాలనుకుంటున్న బీజేపీ ప్రతిపాదనను సమర్ధించారు. ఇక తమిళనాడు సీఎం పళని స్వామి కూడా తమ మద్దతు ఎన్డీయేకే నని ప్రకటించారు. ఒడిషా అధికార పార్టీ బీజేడీ మాత్రం ఇంకా తమ వైఖరి ప్రకటించలేదు. మరోవైపు ఏపీ ప్రతిపక్షం వైఎస్సార్ సీపీ ఎన్డీయేకు మద్దతు తెలిపింది.