రామ్‌నాథ్ ఎంపికను స్వాగతించిన మాయ

రామ్ నాథ్‌ కోవింద్ రాష్ట్రపతి అభ్యర్ధిత్వంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. దళితుడైన రామ్ నాథ్ ను బీజేపీ తమ అభ్యర్ధిగా ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆయన అభ్యర్ధిత్వాన్ని తాము వ్యతిరేకించడం లేదని, అయితే విపక్షాలు ఇంత కంటే ఉన్నతమైన వ్యక్తిని అభ్యర్ధిగా ప్రకటిస్తే.. అప్పుడు ఆలోచిస్తామన్నారు. విపక్షాల అభ్యర్ధిపై త్వరలోనే సమావేశం జరుగుతుందని మాయావతి తెలిపారు.