రామ్‌నాథ్ అత్యుత్తమ రాష్ట్రప‌తి అవుతారు!

బీహార్ గవర్నర్ రామ్ నాథ్   కోవింద్  అసాధారణ రాష్ట్రపతి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా రామ్ నాథ్ కోవింద్ ను ప్రకటించిన తర్వాత… ఆయన ట్విట్టర్ లో స్పందించారు. రామ్‌నాథ్ అత్యుత్తమ రాష్ట్రప‌తి అవుతార‌ని, పేద‌ బ‌ల‌హీన వ‌ర్గాల త‌ర‌పు ఆయ‌న గ‌ట్టిగా పోరాడుతార‌న్నఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా సేవ కోసం జీవితాన్ని వెచ్చించార‌ని, పేద‌బ‌ల‌హీన వ‌ర్గాల కోసం జీవితం ధార‌పోశార‌ని చెప్పారు. న్యాయ‌ప‌ర‌మైన అంశాల్లో ఆయ‌నకు ప‌ట్టు ఉంద‌ని, రాజ్యాంగం ప‌ట్ల రామ్‌నాథ్‌కు ఉన్న అనుభవం దేశానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ప్రధాని తెలిపారు.