రామ్‌నాథ్‌కు సంపూర్ణ మద్దతు

అటు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా రామ్ నాథ్ కోవింద్ అభ్యర్ధిత్వానికి టీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు ఎంపీ కవిత. గతంలో ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు.. ఒక దళిత వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయాలని సూచించారని  కవిత తెలిపారు. సీఎం కేసీఆర్ తో ప్రధాని ఫోన్ సంభాషణ సందర్భంగా .. ఆ మాటలను ప్రధాని గుర్తు చేసినట్లు ఆమె చెప్పారు.

అటు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ ఎంపికపై ఎల్జేపీ నేత రామ్ విలాస్ పాశ్వాన్ హర్షం వ్యక్తం చేశారు. ఒక దళిత వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేసిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. తమ పూర్తి మద్దతు రామ్ నాథ్ కోవింద్ కే ఉంటుందని పాశ్వాన్ చెప్పారు.

అటు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా రామ్ నాథ్ కోవింద్ కు మద్దతుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు శివసేన నేత సంజయ్ రౌత్. శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రేతో బీజేపీ చీఫ్ అమిత్ షా మాట్లాడారని, మరో రెండు మూడు రోజుల్లో తమ నిర్ణయం తెలుపుతామని ఆయన చెప్పారన్నారు.