రామయ్యకు ప్రభుత్వ ఖర్చుతో వైద్యం

అనారోగ్యంతో బాధ పడుతున్న వనజీవి, పద్మశ్రీ దరిపెల్లి రాములుకు పూర్తి ప్రభుత్వ ఖర్చుతో అత్యుత్తమ వైద్యం అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లాకు చెందిన రాములు అస్వస్థతకు గురయ్యారనే సమాచారం తెలుసుకున్న కేసీఆర్ సిఎంఓ అధికారులను అప్రమత్తం చేశారు. సిఎంఓ అధికారులు ఖమ్మం కలెక్టర్ తో మాట్లాడారు. రాములుకు ప్రభుత్వ ఖర్చులతో వైద్యం చేయించాలని నిర్ణయించారు. హైదరాబాద్ కు తీసుకొచ్చి వైద్యం చేయించాలని నిర్ణయించారు.